Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైల్డ్ ఆర్టిస్టుగా చేయటానికి కారణం ఆర్ధిక ఇబ్బందులే: సీత

Seetha Interview
Advertisement
  • మూడో ఏట నుంచే కెమెరా ముందుకు సీత   
  • వివిధ భాషల్లో 60 సినిమాలు చేసిన నటి
  • తల్లి చనిపోవడం గురించిన ఆవేదన
Advertisement
తెలుగులో చైల్డ్ ఆర్టిస్టులుగా శ్రీదేవి .. మీనా .. రోహిణి తరువాత ఎక్కువగా వినిపించిన పేరు బేబీ సీత. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషలలో అనేక చిత్రాలలో ఆమె నటించారు. చాలా కాలంగా ఆమె సీరియల్స్ లో కనిపిస్తున్నారు. తాజాగా ఆమె 'ఎన్ మీడియా' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ ను గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

" మూడేళ్ల వయసులోనే నేను కెమెరా ముందుకు వెళ్లాను. ఆర్ధిక పరమైన ఇబ్బందుల కారణంగానే నేను నటించవలసి వచ్చింది. అప్పట్లో నేను నటించడమనేది నా ఫ్యామిలీకి చాలా హెల్ప్ అయింది. తెలుగులో నా మొదటి సినిమా 'బంధాలు - అనుబంధాలు'. ఆ సినిమాలో శోభన్ బాబు - లక్ష్మి కూతురుగా నటించాను. ఆ తరువాత 'బలిదానం' సినిమాకి శోభన్ బాబుగారు సిఫార్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఒక 60 సినిమాల వరకూ నటించాను" అని అన్నారు. 

" నా మొదటి పారితోషికం 500 రూపాయలు. డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే డబ్బులు వెనక్కి తీసుకుంటారని అమ్మ భయపెడితేనే గాని నేను సరిగ్గా చేయలేదట. 'బంధాలు - అనుబంధాలు'లో చిరంజీవిగారు ఒక కీలకమైన పాత్రను చేశారు. ఆ తరువాత ఆయనతో కలిసి 'సంఘర్షణ' చేశాను. 'హిట్లర్'లో చేసే ఛాన్స్ మాత్రం మిస్సయ్యింది. అనుక్షణం వెంట ఉంటూ వచ్చిన అమ్మ కేన్సర్ తో పోయింది. అప్పటి నుంచి నాకు దేవుడిపై భక్తి పోయింది" అని చెప్పారు సీత. 

Advertisement
Advertisement
Seetha
Actress
Lakshmi
Sobhan Babu

More Telugu News